26.2 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీవేద హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలాలలో శ్రీ వేద హై స్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారు. ఉమ్మడి మండలాల టాపర్గా శ్రీ వేద హై స్కూల్ విద్యార్థి కొత్తపల్లికి చెందిన విక్రం 559 మార్కులతో మండల టాపర్ గా నిలిచారు. ఉమ్మడి మండలాల రెండవ టాపర్ గా ఆయేషారా 539 మార్కులు సాధించారు. పాఠశాల నుంచి మొత్తం 23 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాగా 23 మంది విద్యార్థులు పాసయ్యారు. పాఠశాలకు చెందిన జోయ 524, ఆఫ్రిన్ 522, అర్జున్ 518, అక్షయ 511, మౌనిక 508, అరుంధతి 502 మార్కులు సాధించారు. మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన శ్రీ వేద హైస్కూల్ విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరస్పాండెంట్ తెల్ల అక్షర, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

More articles

Latest article