24 C
Hyderabad
Sunday, August 2, 2026

దారుగల్లిలో ప్రహారి నిర్మాణ పంచాయితీ

Must read

📰 Generate e-Paper Clip

. . . పలువురిపై కత్తులు, పంచులతో చావూస్ ల దాడి

. . . పలువురికి గాయాలు

. . . కేసు నమోదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని 2వ టౌన్ పరిధిలో గల దారుగల్లిలో పురాతన ఇంటిని కూల్చివేసి నూతనంగా చేపట్టిన ప్రహారి నిర్మాణం గొడవకు దారి తీసింది. ప్రహారి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు కత్తులు, పంచులతో దాడులు చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం జరిగింది. నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ వ్యవహరంలో కేసు నమోదైంది. మహ్మద్ అబ్దుల్ మాజిద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సయ్యాద్ బిన్ గనం, హమీద్ బిన్ గనం, నసీర్, యాసిర్ తో పాటు పలువురిపై 4 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అర్బాజ్ అనే యువకుడిని తప్పించారనే వాదనలున్నాయి. చావూస్ ల దాడిలో మోయిజ్, ముజాహిద్, మోతేషాంలకు గాయాలయ్యాయి. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Prahari Construction Panchayat in Darugalli

More articles

Latest article