25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

భీమ్ గల్ లో బంద్ ప్రశాంతం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : పహాల్ గావ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందు పర్యాటక్కులపై చేసిన దాడికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం పట్టణ కేంద్రం లో విజయవంతం అయ్యింది. బంద్ పిలుపును అందుకొన్న స్థానిక వ్యాపారస్థులు స్వచ్చందంగా తమ తమ దుకాణాలను మూసి ఉంచారు.ఉదయం నుండి సాయంత్రం వరకు దుకాణాలను మూసి వేసి పహాల్ గావ్ ఘటనకు నిరసన తెలిపారు.ఈ సందర్బంగా విశ్వ హిందు పరిషత్ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా హిందువులు ఐక్యత పాటించాలని కోరారు. ఘటనకు భాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. బంద్ కు సహకరించిన వ్యాపారస్థులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో విశ్వ హిందు పరిషత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article