24 C
Hyderabad
Sunday, August 2, 2026

200 రోజులు ఉపాధి పని కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

 

డిచ్పల్లి, బతుకమ్మ : జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్విర్యం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఉపాధి పనులను  క్రమేనా నిలిపి వేసేందుకు కుట్ర పన్నుతుందని మొన్న దీనికి కేటాయించిన బడ్జెట్లో కోత పెట్టిందని అఖిలభారత రైతుకూలి సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఉపాధి కూలీలకు 200  పని దినాలు కల్పించి 600 రూపాయల కూలీ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఘనపూర్ గ్రామంలో ఉపాధి కూలీల పని క్షేత్రంలో కూలీలతో మాట్లాడారు. ఉపాధి యాక్ట్ ప్రకారం కూలీలకు కల్పించే వసతులు ఏమీ లేవని, పని క్షేత్రంలో నీడ వసతి గాని, నీటి వసతి గాని, మెడికల్ కిట్టు గాని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు గానీ లేవని వారు అన్నారు. కూలీలకు వారానికి ఒక గ్రూప్ వారికి మాత్రమే పని కల్పిస్తున్నారని,  కనీసం వందరోజుల పని దినాలలో 40 రోజులు కూడా పనులు కల్పించలేదు అని  వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు గత సంవత్సరం రోజుకు 300 రూపాయలు నిర్ణయిస్తే ఈ సంవత్సరం దానికి ₹7 పెంచి 307 రూపాయలు నిర్ణయించిందని కేవలం ఏడు రూపాయల పెంపు  పెరుగుతున్న నిత్యవసర ధరలతో పోలిస్తే ఏమాత్రం సరిపోదని వారన్నారు. కూలీలకు పనిముట్లు అందజేయడం లేదని కనీసం గడపరా, పారా సరి చేయుటకు డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు. గ్రామ ప్రాంతాలను మున్సిపల్ లో, నగరాలో కలపడం వల్ల ఉపాధి పనులు పొందిన కూలీలకు దీనివల్ల పనులు దొరకడం లేదు, ఈ రకంగా 50% కూలీలు పనులు కోల్పోయారు. పట్టణ వాసులకు కూడా  ఉపాధి హామీ పనులు కల్పించాలని వారన్నారు. కూలీలకు రేషన్  ద్వారా తక్కువ ధరలకే పోషక విలువలు కలిగిన నిత్యావసర సరుకులు అందించాలని వరన్నారు. అర్హులైన ప్రతి కూలీకి ఉపాధి హామీ జాబ్ కార్డు ఇవ్వాలని అన్నారు. పనులు చేసిన కూలీలకు డబ్బులు సకాలంలో వారి ఖాతాలో జమ చేయడం లేదని వారన్నారు.  ఈ కార్యక్రమం లో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, జిల్లా నాయకులు దాస్, కృష్ణ, ఉపాధి కూలీలు దేవయ్య, సృజన్, లక్ష్మి, సుమలత, శ్రీకాంత్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article