200 రోజులు ఉపాధి పని కల్పించాలి
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిచ్పల్లి, బతుకమ్మ : జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్విర్యం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఉపాధి పనులను క్రమేనా నిలిపి వేసేందుకు కుట్ర పన్నుతుందని మొన్న దీనికి కేటాయించిన బడ్జెట్లో కోత పెట్టిందని అఖిలభారత రైతుకూలి సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు కల్పించి 600 రూపాయల కూలీ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఘనపూర్ గ్రామంలో ఉపాధి కూలీల...