నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లాలోని మిగతా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల కన్నా అధిక శాతం ఫలితాలను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ గంధం బుద్ధిరాజు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ అభినందించారని తెలిపారు. కళాశాలలో మొత్తం మీద రెండవ సంవత్సరంలో 61.37% ఫలితాలు, మొదటి సంవత్సరంలో 49.32% ఫలితాలను సాధించి జిల్లాలో మొదటి స్థానంలో తమ కళాశాల నిలిచిందని పేర్కొన్నారు. అలాగే తొమ్మిది వందలకు పైగా మార్కులను అనేక మంది విద్యా ర్థినిలు సాధించాలని తెలియజేశారు. వీరిలో బైపిసి ఇంగ్లీష్ మీడియం లో మలిహ ఆర్ఫిన్, ఇస్ బా నూరి లు 974 మార్కులు సాధించి కళాశాలలో మొదటి స్థానంలో నిలిచారని, అలాగే ఉర్దూ మీడియం బైపీసీ లో ఆశ్ర 963 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారని అలాగే ఎంపీసీలో 956 మార్కులతో జ్యోతిర్మయి మొదటి స్థానంలో నిలిచిందని తెలియజేశారు. ఒకేషనల్ ఆఫీస్ అసిస్టెంట్ షిప్ కోర్సులో ఎస్.పూజ 974 మార్కులతో కళాశాలలో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాటు అన్ని సౌకర్యాలు కళాశాలలో ఉన్నాయని తెలిపారు. కళాశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలల తో పాటు లైబ్రరీ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కళాశాల విద్యార్థునిలు అభ్యాసం చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు.ఆర్ ఓ మంచినీటి వసతి, పరిశుభ్రతతో కూడిన బాలికలకు ఇబ్బందులు లేని టాయిలెట్ వసతులు ఉన్నాయన్నారు. విశాలమైన తరగతి గదులు మంచి ఫర్నిచర్ ఉన్నాయని, ప్రతి విద్యార్థిని పై ప్రత్యేక శ్రద్ధ వహించి వార, నెలవారి పరీక్షలతో పాటు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సర పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. కళాశాలలో ఎం.పీ.సీ., బై.పి.సి., సి.ఇ.సి., హెచ్. ఈ. పి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం తో పాటు ఒకేషనల్ లో ఆఫీస్ అసిస్టెంట్ షిప్, కంప్యూటర్ సైన్స్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ కోర్సులు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లలో ఉన్నాయని తెలిపారు.
