10 గ్రాములకు దాదాపు రూ.3 వేలు తగ్గుదల
వెబ్ న్యూస్, బతుకమ్మ : అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్ లో ఆల్ టైం గరిష్టానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.3 వేలు తగ్గింది. బుధవారం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,700 గా ఉంది. అటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.98,720గా ఉంది. మరోవైపు ఏప్రిల్ 30న అక్షయ తృతీయ నాటికి బంగారం ధరలు తగ్గకపోతే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
