29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కొనసాగుతున్న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

 హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 77.68% పోలింగ్ నమోదైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మజ్లిస్ నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ  నుంచి  గౌతమ్ రావు ఈఎన్నికల బరిలో ఉన్నారు. ఈఎన్నికల్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.. 250 మందితో  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది.

More articles

Latest article