29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏర్గట్ల పాఠశాలను సందర్శించిన దోoచంద విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ కార్యక్రమంలో  భాగంగా ఏర్గట్ల మండలంలోని  దోoచంద ప్రాథమికోన్నత  పాఠశాల విద్యార్థులు ఏర్గట్ల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని గ్రంథాలయాన్ని, సైన్స్ ల్యాబ్ ను, తరగతి గదులను,ప్యానల్  బోర్డులను చూడడం, గ్రంథాలయంలో ఉన్న కథల పుస్తకాలను తీసుకొని విద్యార్థులు చదవడం,ఆటల పరికరాలతో చక్కగా ఆడుకోవడం, ఫ్యానల్ బోర్డులో అనేక విషయాలను విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించిన విద్యార్థులకు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి, పరీక్ష అట్టలను వితరణ చేశారు. విద్యార్థులు చక్కగా  చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దోoచంద ఉపాధ్యాయులు శ్రీనివాస్ సంగీత,ఏర్గట్ల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

More articles

Latest article