28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇండియాకు రావాలనుంది..

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: అమెరికా ప్రభుత్వంలో కీలక వ్యక్తి, టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మాస్క్ తనకు ఇండియాకు రావాలనుందని అన్నారు. ఇండియాలో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నరేంద్ర మోడీ, ఎలాన్ మాస్క్ ఫోన్ లో మాట్లాడుకున్న తరువాత వారిరువురూ ‘ఎక్స్’లో వేర్వేరుగా పోస్టులు చేశారు. తామిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నామని, ఈ ఏడాది ప్రారంభంలో తాను అమెరికాలో పర్యటించిన సందర్భంగా చర్చించిన అంశాలపై సమాలోచనలు చేశామని, సాంకేతికత, ఆవిష్కరణల్లో అమెరికాతో కలిసి ముందుకు వెళ్లేందుకు ఇండియా సిద్ధంగా ఉండాలని మోదీ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

More articles

Latest article