కూతురికి విషం ఇచ్చి తాను సేవించిన తల్లి

0 4,179

చికిత్స పొందుతూ కూతురి మృతి

మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రగతినగర్ లో విషాదం

బాచుపల్లి, బతుకమ్మ : ఓ తల్లి కూతురికి విషం ఇచ్చి తాను విషాన్ని సేవించింది. ఈక్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూతురు మృతి చెందింది. ఈవిషాద ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని  ప్రగతినగర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 18వ తేదీన సాయంత్రం తల్లి క్రిష్ణపావని కూతురు జశ్వికకి కూల్‌ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. అనంతరం క్రిష్ణపావని సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. 19వ తేదీ తెల్లవారుజామున ఇద్దరినీ స్థానికులు  ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక మృతి చెందింది. తల్లి  క్రిష్ణపావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. క్రిష్ణపావనికి ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.