27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

లారీ కిందపడి యువకుని మృతి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : పొట్టకూటికోసం బీహార్ నుండి  హామాలి పని నిమిత్తం వచ్చిన ఓ యువకులు లారీ డ్రైవర్ అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల మృతి చెందిన ఘటన మండలంలోని తాళ్ళపల్లిలో చోటు చేసుకొంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాళ్లపల్లి సొసైటీలో వడ్లు తూకం చేసి లారీల్లో లోడ్ చేసేందుకు బీహార్ నుండి సూరజ్ కుమార్ (21)యువకుడు హమాలీ పని చేయడానికి వచ్చాడు.ఆ క్రమంలో శుక్రవారం తన రోజువారి పనిని ముగించుకొని రూం కు వచ్చి ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ బైటకు వెళ్ళాడు. ఇంటి వాళ్ళతో ఫోన్ మాట్లాడిన అనంతరం అక్కడ ఉన్న వడ్ల కుప్పల దగ్గర పడుకొన్నాడు. అక్కడికి వడ్ల లౌడింగ్ వచ్చిన  టి. ఎస్. 16 యుబి 6789 నెంబర్ గల లారీ డ్రైవర్ రౌతు రాజు సూరజ్ పడుకొన్నది గమనించక సూరజ్ పైకి లారీ టైర్ ను ఎక్కించాడు. దాంతో నిద్రలో ఉన్న సూరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మృతిని కుటుంబీకుడు పరమేశ్వర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

More articles

Latest article