కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రైస్తవ సంఘాలు రీజినల్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం సి.ఎస్.ఐ చర్చ్ నుండి పాత బస్టాండ్ వరకు అక్కడ నుండి సిఎస్ఐ చర్చి వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ బోధకులు మాట్లాడుతూ సమాజంలో యేసు క్రీస్తు కోసం ఆయన బోధనలు గౌరవంగా బోధిస్తామని పేర్కొన్నారు. యేసు క్రీస్తు మానవాళి కొరకు సిలువలో మరణించాడని గుర్తు చేశారు. ఆయనను ప్రతి ఒక్కరు రక్షకుడిగా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కృపాకర్, పాస్టర్ మాణిక్యం, రెవరెండ్ జోసెఫ్ కిషోర్, పాస్టర్ బివై స్వామి, పాస్టర్ రత్నాకర్, పాస్టర్ స్టీవెన్ రమేష్, పాస్టర్ పీటర్, పాస్టర్ మోజెస్, పాస్టర్ జోసెఫ్ , పాస్టర్ సుదర్శన్ క్రిస్టియన్ నాయకులు హోసన్నా, యేసురత్నం, ఇమ్మానియేల్, రాజుసాగర్,దయాకర్, లాజర్, కుమార్,ఎర ప్రశాంత్ క్రిస్టియన్ సంఘాల విశ్వాసులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

