రీజినల్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రైస్తవ సంఘాలు రీజినల్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం సి.ఎస్.ఐ చర్చ్ నుండి పాత బస్టాండ్ వరకు అక్కడ నుండి సిఎస్ఐ చర్చి వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ బోధకులు మాట్లాడుతూ సమాజంలో యేసు క్రీస్తు కోసం ఆయన బోధనలు గౌరవంగా బోధిస్తామని పేర్కొన్నారు. యేసు క్రీస్తు మానవాళి కొరకు సిలువలో మరణించాడని గుర్తు చేశారు. ఆయనను...