27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పార్ట్ టైమ్ అధ్యాపకులను వెంటనే క్రమబద్ధికరీంచాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్

 

రుద్రూర్, బతుకమ్మ : వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైమ్ అధ్యాపకుల సర్వీసులను వెంటనే క్రమబద్ధికరించాలని (ఏ.ఐ.ఎస్.బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్ట్ టైమ్ అధ్యాపకులకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కొత్తగా చేపట్టే అసిస్టెంట్ ప్రొపెసర్ల నియామకాలలో వేయిటెజ్ కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైమ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న గురువారం నిర్వహించిన ఛలో సెక్రటరియేట్ నిరసనల్లో అరెస్ట్ అయిన పార్ట్ టైమ్ అధ్యాపకులను బేషరత్తుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారి ఆందోళనకు మా (ఏ.ఐ.ఎస్.బి) విద్యార్థి సంఘం పూర్తి మద్దతు ఉంటదని ఆయన అన్నారు.

More articles

Latest article