27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

 గజవాడ హన్మంత్ రావుకు సిఇగా పదోన్నతి

Must read

📰 Generate e-Paper Clip

 . .  రూరల్ అర్ అండ్ బి సిఇగా భాధ్యతల స్వీకరణ

 బతుకమ్మ , నిజామాబాద్:

నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ సూపరింటేండేంట్ ఇంజనీర్ గజవాడ హన్మంత్ రావుకు చీఫ్ ఇంజనీర్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం గజవాడ హన్మంత్ రావుకు సిఇగా పదోన్నతి కల్పిస్తు హైద్రాబాద్ లోని ఎర్రమంజీల్ లోని   రూరల్ రోడ్డు భవనాల శాఖ కు చీప్ ఇంజనీర్ గా పోస్టింగ్ ఇచ్చారు. శనివారం అయన సీఇగా బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ నగరానికి చెందిన గజవాడ హన్మంత్ రావు 1986 ఎఇఇగా రోడ్డు భవనాల శాఖలో ప్రస్థానం ప్రారంభించారు. నిజామాబాద్, కామారెడ్డి, బోదన్, సిద్ధి పేట్, మహభూబ్ నగర్, కరీం నగర్ జిల్లాలో వివిధ హోదా లో పని చేసి ఐదు నెలల క్రితం నిజామాబాద్ ఎస్ఇ గా బదిలీ అయ్యారు. నిజామాబాద్ లో  అత్యధికకాలం పని చేసి  రోడ్లు భవనాల శాఖ లో తనదైన ముద్ర వేసుకున్నారు. స్టేట్ లో ఓక ఇఎన్ సి , ఇద్దరు సిఇలు ఉండగా అందులో ఓక్కరు నిజామాబాద్ వాసీ కావడం గర్వకారణం.గజవాడ హన్మంత్ రావు బదిలీ కాగా అయన స్థానంలో నిజామాబాద్ లో  ఎవ్వరికి పోస్టింగ్ ఇవ్వలేదని  సమాచారం.

Gajawada Hanmant Rao promoted as CE

More articles

Latest article