- ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్
కామారెడ్డి, బతకమ్మ : భూ భారతి రెవిన్యూ సదస్సు లింగం పేట్ పైలెట్ మండలంగా ఈ నెల 17 నుండి 30 వరకు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రెవిన్యూ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు రెవిన్యూ అధికారులు సిబ్బందితో టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 17 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు పోతేపల్లి, బోనాల గ్రామాల్లో, 19 న బాయంపల్లి, కన్నాపూర్, 21 న పెరుమాళ్ళ, పోలకంపేట, 22 న ఎల్లారం, మెంగారం, 23 న రాంపూర్, జల్దిపల్లె, 24 న బాణాపూర్, కోర్పోలే, లింగంపల్లె (khurd), 25న భవానీపేట్, మంబాజీపేట, లింగం పేట్, 26 న కంచమహల్, కొండాపూర్, 28న నల్లమడుగు, నగరం, షేట్పల్లె సంగారెడ్డి, 30 న షేట్పల్లె, మోతె గ్రామాల్లో సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులలో యు.సురేష్ తహసీల్దార్ బృందం, ఎల్. చరణ్ సింగ్, నాయబ్ తహసీల్దార్ బృందం, రాజేశ్వర్ నాయబ్ తహసీల్దార్ బృందం లలో వారి సిబ్బందితో ఆయా గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. ప్రజలు , రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
