నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. నిజామాబాద్ నగరంలో ఐదో టౌన్ పోలీసులు సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మెదక్ జిల్లా గాంధీ నగర్ కు చెందిన చింతల కుమార్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. సదరు వ్యక్తిని మంగళవారం న్యాయస్థానంలో హాజరుపర్చగా, రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
