27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సొంత గూటికి మాజీ సర్పంచులు

Must read

📰 Generate e-Paper Clip

. గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: బాల్కొండ నియోజకవర్గంలోని పలువురు మాజీ సర్పంచులు సొంత గూటికి చేరారు. బీఆర్ఎస్ ను వీడిన వారు తిరిగి పార్టీలో చేరగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని అన్ని వర్గాల వారిని ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారన్నారు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపైఉన్న భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని అన్నారు.

ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, అందుకే పార్టీలో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో మెండోరా మండలం సోన్ పేట్ మాజీ సర్పంచ్ గోలి ప్రకాశ్, దూదిగాం మాజీ సర్పంచ్ పసుల శ్రీనివాస్ తోపాటు అనుచరులు, నాయకులు ఉన్నారు.

కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కమలాకర్, మాజీ ఎంపీటీసీ దేవేందర్, బాబా, మాజీ సర్పంచులు నాగుల నర్సయ్య, గంగారెడ్డి, రాజారెడ్డి, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article