- ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మల్యాల గోవర్ధన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంబేద్కర్ స్ఫూర్తితో మనవాదపు కుట్రలను తిప్పి కొట్టాలని ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మల్యాల గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు కృష్ణ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచశీల జెండాను, జై భీమ్ జెండాను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్యాల గోవర్ధన్, ధ్యారంగుల కృష్ణ లు మాట్లాడుతూ దేశ స్వాతంత్రానంతరం భారతదేశాన్ని నవ సమ సమాజ స్థాపన దిశగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ప్రజలకు అందించారని తెలిపారు. అత్యంత పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కేంద్రంలో ఉన్న పాలకులు తుంగలో తొక్కుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే నేడు ఆయనకు అర్పించే నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్, నిర్మల భాయి, సంతోష్, ఆకాష్, రహమత్, కల్పన, లావణ్య, అభయా హస్తం కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

