27.5 C
Hyderabad
Friday, July 31, 2026

అర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడి ఈగ సంజీవ్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

. ఏకగ్రీవంగా అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుమ్మ: జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈగ సంజీవ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని సంజీవరెడ్డి నగర్ కాలనీలో అర్చరీ అసోసియేషన్ ఎన్నికను ఎన్నికల అధికారి గంట ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2025 – 29 కాలానికి కార్యవర్గాన్ని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఎంవీ సుబ్బారావు, కోశాధికారిగా మంథని బాలగంగాధర్, ప్రధాన కార్యదర్శి  గా కే. గంగరాజు, సంయుక్త కార్యదర్శిగా ఈగ పోతన్న, సభ్యుడిగా భదవత్ గణేశ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర అర్చరీ అసోసియేషన్ అబ్జర్వర్ గా పి అరవింద్ కుమార్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ గా అంద్యాల లింగన్న, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్  మీసాల ప్రశాంత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో బోర్గాం సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, గాదారి సంజీవరెడ్డి, సయ్యద్ నాభి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article