24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బైక్ ఆపేందుకు ట్రాఫిక్ పోలీసుల యత్నం.. ఆర్టీసీ బస్సు కింద పడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ లోని బాలానగర్ లో ఘటన

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని బాలానగర్ లో తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఓ వ్యక్తి బైక్ ఆపేందుకు యత్నించారు. ఈక్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడటంతో ఆర్టీసీ బస్సు అతడి మీద నుంచి దూసుకెళ్లి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం  వల్లే వ్యక్తి మృతి చెందాడని వాహనదారులు ఆందోళన చేపట్టారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలా నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాగ్వాదానికి దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు.

More articles

Latest article