30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ట్రేడ్ లైసెన్స్ ఫీ పేరున వ్యాపారస్తులను వేధిస్తున్నారు

Must read

📰 Generate e-Paper Clip

  • ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వర్ రావు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రేడ్ లైసెన్స్ ఫీ పేరున మున్సిపల్ సిబ్బంది వ్యాపారస్తులను వేధిస్తున్నారని ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వర్ రావు అన్నారు. ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో మునిసిపల్ కమీషనర్ ను కలిసి వ్యాపారాస్తుల సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా ఇష్టమొచ్చిన ఫీజులు వసూలు చేస్తున్నారని, తమ ఐడెంటిటీ తెలుపకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా కోర్టు ఆర్డర్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యుల ఐడెంటిటీ సర్టిఫికెట్ చూయిస్తే హై కోర్టు ఆర్డర్ ప్రకారం వారి నుండి ట్రేడ్ లైసెన్స్ ఫీ ప్రస్తుతం వసూలు చేయమని కమీషనర్ తెలిపారు. అదే విధంగా వేధింపులకు పాల్పడుతున్నారని తమ సిబ్బంది పై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కమల్ ఇనాని,  నిషిత రాజు పూర్వ అధ్యక్షులు మోహనరెడ్డి, భక్తవత్సలమ్,శామ్ అగర్వాల్, వెంకట్నారస గౌడ్,దినేష్ రెడ్డి, సభ్యులు నర్సింహారెడ్డి, శ్రీనివాసరావు,గంగాధర్ రావు, జమీల్, హరి ప్రసాద్, ఎల్వీఆర్ ప్రసాద్, దాస్, పటేల్, డా. కౌలయ్య, దర్శన్సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Businessmen are being harassed in the name of trade license fees.

More articles

Latest article