27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

భూ కబ్జా చేసినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

ఆరోపణలు నిరూపిస్తే పల్లా, రాజయ్య ఇంట్లో గులాంగా పని చేస్తా

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వెబ్ న్యూస్, బతుకమ్మ : తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. దేవునూరు గుట్టలను ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. రెండు వేల ఎకరాలు కబ్జా చేశానంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తాను కబ్జాచేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇంట్లో గులాంగా పని చేస్తానని వ్యాఖ్యనించారు. ఆరోపణలు నిరూపించకపోతే వారు నాకు గులాంగా ఉంటారా అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.

More articles

Latest article