భూ కబ్జా చేసినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా
ఆరోపణలు నిరూపిస్తే పల్లా, రాజయ్య ఇంట్లో గులాంగా పని చేస్తా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెబ్ న్యూస్, బతుకమ్మ : తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. దేవునూరు గుట్టలను ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. రెండు వేల ఎకరాలు కబ్జా చేశానంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ర్పచారం చేస్తున్నారన్నారు....