బతుకమ్మ, పిట్లం : మండలంలోని బొల్లాక్ పల్లి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని బాన్సువాడ పట్టణ సీఐ రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ….సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులందరూ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
