27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్యే భూపతి రెడ్డితో”బార్” అధ్యక్షుని భేటీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది మామిల్ల సాయరెడ్డి శనివారం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే బార్ అధ్యక్షున్ని శాలువా,పూలగుచ్ఛంతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ కాలం నుండి న్యాయవాద సమాజంతో అవినాభావ సంబంధం పెరిగిపోయిందని అన్నారు. జిల్లాకోర్టు అవసరాల దృష్ట్యా ఓల్డ్ విధ్యశాఖ కార్యాలయ ఖాళీ స్థలాన్ని కేటాయించే విధంగా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయవాద బృదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కోరాదమని ఆయన అన్నారు.అనంతరం ఎమ్మెల్యే ను బార్ అధ్యక్షుడు శాలువా, పూలగుచ్ఛంతో సత్కరించారు.నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డైరెక్టర్ లు సాయరెడ్డి ని పూలమాలలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది అమిడాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి జే,వెంకటేష్ న్యాయవాదులు నరసింహ రెడ్డి ,నీలకంఠ రావు,జగన్మోహన్ రెడ్డి, శ్రీరామ గౌడ్,దయాకర్ గౌడ్,ప్రభాకర్ రెడ్డి, శ్యామ్ బాబు, మద్దెపల్లి శంకర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article