ఎమ్మెల్యే భూపతి రెడ్డితో”బార్” అధ్యక్షుని భేటీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది మామిల్ల సాయరెడ్డి శనివారం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే బార్ అధ్యక్షున్ని శాలువా,పూలగుచ్ఛంతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ కాలం నుండి న్యాయవాద సమాజంతో అవినాభావ సంబంధం పెరిగిపోయిందని అన్నారు. జిల్లాకోర్టు అవసరాల దృష్ట్యా ఓల్డ్ విధ్యశాఖ కార్యాలయ ఖాళీ స్థలాన్ని కేటాయించే విధంగా తనవంతు కృషి...