29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బైపాస్ లో మహిళ మర్డర్

Must read

📰 Generate e-Paper Clip

  • మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
  • తల్లిని రొంపిలోకి దించిందని మహిళను దారుణంగా హతమార్చిన కొడుకు
  • గురువారం రాత్రి బైపాస్ రోడ్డులో తలపై బండతో మోది హత్య
  • శుక్రవారం కారు డిక్కీలో డేడ్ బాడిని తరలిస్తుండగా పట్టివేత

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ నగర శివారులో దాస్ నగర్ వద్ద గల నిజాం సాగర్ కెనాల్ వద్ధ కారు డిక్కీలో దొరికిన మహిళ మృతదేహం విషయంలో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. శుక్రవారం పట్టపగలు నిజామాబాద్ రూరల్ పోలీసులు (బ్లూకోట్  సిబ్బంది) రోడ్డు పక్కన సాధారణంగా విధులు నిర్వహిస్తుండగా ఒక కార్ ఓవర్ స్పీడ్ తో వెళ్లి తీసుకున్న టర్న్ ను పోలీసులు అసాధరణంగా ఉందని  పసిగట్టడంతో మహిళ మర్డర్ జరిగిన విషయం తెలిసింది. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడంతో మహిళ మర్డర్ దాని వెనుక ఉన్న విషయాలు పోలీసులు విచారణ సాగిస్తున్నట్టు సమాచారం..

విశ్వసనీయ సమాచారం మేరకు… నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ ప్రాంతంలో కమల (50) అను మహిళ. మరొక మహిళ ఇరుగు పొరుగు ఇళ్లలో నివసిస్తున్నారు. ఇద్ధరు కలిసి ఓకే చోట పని చేస్తు కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. కమల తన పొరిగింటి మహిళను రొంపిలోకి దించిందని ఆమె తనయుడు కక్ష పెంచుకున్నాడు. కారు డ్రైవర్ గా పనిచేసే సదరు యువకుడు గురువారం రాత్రి కమలను నమ్మించి బైపాస్ రోడ్డుకు తీసుకువచ్చాడు. అక్కడ   ఏం జరిగిందో తెలియదు కాని బండరాయితో మోది కమలను దారుణంగా హత్య చేసి ఎమీ ఎరుగనట్టు డెడ్ బాడిని అక్కడే వదిలి ఇంటికి వెళ్లిపోయాడు.

శుక్రవారం మధ్యాహ్నం ప్రాంతంలో సదరు యువకుడు కమల మృతదేహంను తన కారు డిక్కీలో వేసుకుని నగర శివారు ప్రాంతంలో పారవేయాలని ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగా డేడ్ బాడిని తన కార్ డిక్కీలో వేసుకుని రయ్ న దుసుకెళ్లాడు. అప్పడు ఆర్మూర్ రోడ్డులో విధులు నిర్వహిస్తున్న రూరల్ పోలీస్ సిబ్బంది ఓవర్ స్పీడ్ తో వెలుతున్న కారును వెంబడించారు. కారు దాస్ నగర్ వద్ద నిజాం సాగర్ కాలువ పక్కన నిర్మాణుష్య ప్రాంతంకు వెళ్లడంతో అనుమానంతో వెంబడించారు. అక్కడ కారు ఆగి ఉండటంతో వెళ్లి పరిశీలించి, యువకుడిని విచారించడంతో మహిళ మర్డర్ విషయం వెలుగులోకి వచ్చింది. కమల డెడ్ బాడిని పోస్టు మార్టం కోసం తరలించి విచారణ చేపట్టారు.

Woman murdered on bypass

More articles

Latest article