30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ముగిసిన”బార్”నామినేషన్ల పర్వం

Must read

📰 Generate e-Paper Clip

  • అధ్యక్ష పదవికి సింగిల్ నామినేషన్
  • అధ్యక్షుడిగా మామిళ్ల సాయిరెడ్డి ఎన్నిక లాంఛనమే

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 వార్షిక సంవత్సరానికిగాను నామినేషన్లు బుధవారం ముగిసినట్లు ఎన్నికల అధికారులు జె.వెంకటేశ్వర్,ఆర్.ఎస్.ఎల్ గౌడ్ తెలిపారు. అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది మామిల్ల సాయరెడ్డి ఒకరు మాత్రమే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి వి.దిలీప్, రేంజర్ల  సురేష్, ప్రధాన కార్యదర్శికి మానిక్ రాజు, భాస్కర్ రెడ్డి, బాలరాజ్ నాయక్, సంయుక్త కార్యదర్శికి సత్యనారాయణ గౌడ్, ఝాన్సీరాణి, కోశాధికారిగా నారాయణ దాసు, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శిగా మంజీత్ సింగ్, లైబ్రరీ కార్యదర్శిగా శ్రీమాన్, మహిళ ప్రతినిధిగా రమాదేవి నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారని తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా మద్దెపల్లి శంకర్, ఆయుబ్, భిక్షపతి, ముబీన్, అరేటి నారాయణ, ఇంతియాజ్, సుజిత్, వెంకటేశ్, ప్రవీణ, గణేశ్, అఖిల నామినేషన్ వేసినట్లు తెలిపారు. మార్చి 27 న నామినేషన్ పత్రాలను పరిశీలన, 28 న ఉపసంహరణను అవకాశం కల్పించి, 29న పోటీలో ఎవరెవరు ఉన్నారో ప్రకటించి, అవసరం మేరకు ఏప్రిల్ 11 న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సింగిల్ నామినేషన్ మామిళ్ల సాయిరెడ్డి దాఖలు చేశారు. మరెవరూ నామినేషన్ దాఖలు చేయక పోవడంతో అధ్యక్ష పదవి ఎన్నిక లాంఛనం కానుంది. మిగిలిన కార్యవర్గంలో నామినేషన్ ల ఉప సంహరణ తరువాత ఎన్నికలు జరుగుతాయా.. ఏకగ్రీవం అవుతాయా.. అనేది ఈనెల 28 తరువాత తేలనుంది.

More articles

Latest article