నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగగ.. సాయంత్రం స్వామివారు గరుడ వాహనంపై ఊరేగారు. రథంపై స్వామి వారిని నర్సింగ్ పల్లి గ్రామంలో రహదారుల వెంబడి ఊరేగించారు. రథం దాత “మహబూబ్ నగర్ నివాసి శ్రీమాన్ రాంరెడ్డి కుటుంబ సభ్యులు మొదటగా రథాన్ని లాగగా గ్రామస్థులు, భక్తులు అందరు రథాన్ని మాడవీధుల మీదుగా గ్రామంలో కి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన ఆడబిడ్డలు మంగళ హారతులతో స్వామి వారిని ఆహ్వానించారు. గ్రామ యువత ఆట పాటలతో రథ యాత్ర లో పాల్గొన్నారు. రథంపై స్వామి వారు ఊరిలోకి రావడంతో గ్రామం మొత్తం శోభాయమానంగా మారింది. ఈ కార్యక్రమాల్లో దేవనాథ జియర్ స్వామి ఆచార్య గంగోత్రి రామానుజదాస్ స్వామి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలైన ప్రముఖ నిర్మాత సోదరులు దిల్ రాజు, శిరీష్ ఉత్సాహంగా రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి, విజయసింహ రెడ్డి, సర్పంచ్ సాయరెడ్డి, ఎంపీటీసీ రాములు, నర్సారెడ్డి, ప్రసాద్, పృథ్వి, నరాల సుధాకర్, రాజేశ్వర్, రమేష్, భాస్కర్, మురళి, యాజ్ఞాచార్యులు శిఖామణి ఆచార్య, రోహిత్ కుమారాచార్యులు, నరసింహ మూర్తి స్వామి తదితరులు పాల్గొన్నారు.
