25.6 C
Hyderabad

సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ వీసీగా వైఎల్ శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి వీసీగా  బోధన్ వాస్తవ్యులు ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్  నియమితులయ్యారు. శ్రీనివాస్ తన గ్రాడ్యూయేట్  వరకు బోధన్ లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ(ఇంగ్లీష్), ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఇంగ్లీష్ లో భారతీయ రచనలు, ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్, ఇంగ్లీష్ భాష బోధన తదితర అంశాలపై పరిశోధనలు చేశారు. అంతర్జాతీయ జర్నల్స్ లో ఆయన రాసిన 34పైగా వ్యాసాలు ప్రచురితం కాగా 10 పాఠ్య పుస్తకాలను కేంబ్రిడ్జీ, మెక్ మిలన్, బ్లాక్ స్వాన్ వంటి ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. ఈ సందర్భంగా వైఎల్ శ్రీనివాస్ ను ఆయన సతీమణిని బోదన్ లోని ఆయన ఇంటిలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ స్కూల్ కరస్పాండెంట్  కొడాలి కిషోర్, కొడాలి లావణ్య లక్ష్మీ, ఇందూర్ స్కూల్ అడ్మనిస్ట్రేటివ్ ఇంచార్జీ స్వాతి, అంజలి, విద్యా వికాస్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎల్ఎన్ నర్సింహా రెడ్డి, ఎల్ఎన్ శశి భూషన్, గంగా శంకర్, గౌసుద్దీన్, గణపతి రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్, సాలూర తహసీల్దార్ శశి భూషన్ పాల్గొన్నారు.

YL Srinivas appointed as VC of Sammakka Sarakka Tribal University

More articles

Latest article