25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మున్సిపాలిటీగా బిచ్కుంద..?

Must read

📰 Generate e-Paper Clip

  • ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

 

బతుకమ్మ, బిచ్కుంద  : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండలానికి మునిసిపాలిటీ గా రూపు దిద్దుకుంటుందని ఆ నోట ఈ నోట గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఇదిలా ఉండగా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా జుక్కల్ నియోజకవర్గం పేరు ఉండడం పేరుకు మాత్రమే “జుక్కల్” మండలం నియోజకవర్గానికి పేరుగా ఉన్నప్పటికిని జుక్కల్ నియోజకవర్గంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన ప్రాంతం బిచ్కుంద మండల కేంద్రం కాబట్టి బిచ్కుంద మున్సిపాలిటీగా రూపు దిద్దుకుంటుందని పలువురు భావిస్తున్నారు.

1955 జనవరి 26వ తేదీన గ్రామపంచాయతీగా అవతరించిన బిచ్కుంద అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉందని మున్సిపాలిటీగా అవతరించినట్లయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజా సౌకర్యార్థం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనున్నామని పలువురు ప్రజాప్రతినిధులు గత, వర్ధమానంలో హామీలు ఇవ్వగా అధికారులు మున్సిపాలిటీ కొరకై ప్రతిపాదనలు పంపివ్వడం జరిగింది. ఇట్టి విషయమై ఎంపీడీవో గోపాలకృష్ణను బతుకమ్మ బిచ్కుంద వివరణ కోరగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపించిన మాట వాస్తవమేనని జనాభా, విస్తీర్ణం ను దృష్టిలో ఉంచుకొని కందర్పల్లి, గోపన్ పల్లి, దౌల్తాపూర్, బిచ్కుంద గ్రామపంచాయతీలో నుండి తీర్మానాలను తీసుకొని ప్రతిపాదనలు పంపించిన మాట వాస్తవమేనని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా గోపన్ పల్లి గ్రామానికి చెందిన ప్రజలందరూ కూడా మా ప్రమేయం లేకుండా మా అభిప్రాయం సేకరణ చేయకుండా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? మేం సాసే మీరా మున్సిపాలిటీలో కలిసేది లేదని మేము మా ఊరి గ్రామపంచాయతీ పరిధిలోనే ఉంటామని మేము మున్సిపాలిటీని వ్యతిరేకిస్తున్నామని గ్రామ ప్రజలందరూ ధర్నా రాస్తారోకో నిర్వహించి తీవ్రముక్తకంఠంతో వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీ గనక అయినట్లయితే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భూములకు ధరలు వస్తాయని రోడ్ల విస్తరణ జరుగుతుందని వ్యాపార సముదాయాల విస్తీర్ణం మరింతగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతుండగా, నిరుపేద రైతులకు ఉపాధిక కూలీలకు ఉపాధి హామీ పథకం పోతుందని అలాగే టాక్స్ ల భారం తడిసి మోపెడు అవుతుందని చిన్న కారు సన్న కారు వ్యక్తులు గృహ నిర్మాణం చేసుకోవాలన్న, ఒక ప్లాటు ఖరీదు చేయాలన్న వారి ఆశలు అడియాశలు అవుతాయని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీ వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో? ఎవరికి నష్టం చేకూరుతుందో? గాని ప్రస్తుతానికి బిచ్కుందకు మున్సిపాలిటీ అనే ఫీవర్ పట్టుకుందని పలువురు ఆ నోట ఈ నోట గుసగుసలాడుకుంటున్నారు.

More articles

Latest article