బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం, పాలెం గ్రామానికి చెందిన సుద్దాల హరీష్ గౌడ్ టీఎస్పీఎస్సీ 2023 లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మకమైన జూనియర్ లెక్చరర్, ఇంగ్లీష్ పరీక్షలో ఉన్నత మార్కులు పొంది ఉద్యోగం సాధించారు. ఇది హరీష్ సాధించిన నాలుగవ ఉద్యోగం కావడం విశేషం. 2017 లో నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయుల పరీక్షలో పిజిటి, టీ జీ టీ ఉద్యోగాలు సాధించిన ఆయన 2018 నుండి పీజీటీగా టీజీఆర్ఎప్, జేఎల్ గా బాలుర పోచంపాడు లో విధులు నిర్వర్తిస్తున్నారు. గత సంవత్సరం ఆయన గురుకుల జేఎల్ సాధించినప్పటికీ టీఎస్పీఎస్సీ జేఎల్ సాధించగలనన్న నమ్మకంతో ఆ ఉద్యోగాన్ని స్వీకరించలేదు. దిగువ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుండి కష్టపడి చదివి ఇలా ఈ రోజు ప్రతిష్ఠాత్మకమైన జేఎల్ ఉద్యోగాన్ని సాధించినందుకు హరీష్ కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయ బృందం, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల లో చదువుకుని అంచెలంచెలుగా ఎదుగుతున్న హరీష్ నేటి గ్రామీణ యువతకి ఆదర్శం. ఆయన సాధించిన విజయం నేటి యువతకి స్ఫూర్తిగా ఉండాలని ఆయన స్నేహితులు, సహోద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు.
