27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సురవరం పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

హైదరాబాద్, బతుకమ్మ: తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్  చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పేరు మార్పు నిర్ణయాన్ని  తీవ్రంగా వ్యతిరేకస్తున్నాం అన్నారు. ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేకపు చర్య అని తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టిశ్రీరాములు అన్నారు. యూనివర్సిటీ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలనీ సూచించారు. పొట్టి శ్రీరాములు త్యాగం  మర్చిపోలేని చరిత్ర అన్నారు. పొట్టి శ్రీరాములు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, దేశం గర్వించే మహనీయులలో ఒకరని స్వాతంత్ర పోరాటంలో గాంధీ తో కలిసి పనిచేసి, ఖాదీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. అహింసా మార్గం, పట్టుదల, ధైర్యం దేశానికి మార్గదర్శిగా నిలిచాయన్నారు. పొట్టి శ్రీరాములు దళితుల హక్కుల కోసం నిరాహార దీక్ష  చేశారని  తెలిపారు. పొట్టి శ్రీరాములు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా, దళితుల  హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని, దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలనీ నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప సంస్కృతి శాస్త్రవేత్త, సమాజ సేవకులు. వారిని గౌరవించడాన్ని  పూర్తిగా స్వాగతిస్తున్నాం అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పత్రిక సంపాదకులుగా, పరిశోధకులుగా, పండితులుగా, రచయిత గా, క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలనలో తెలుగు వారిపై జరుగుతున్నా అఘాత్యాలను, అవమానాలకు వ్యతిరేకంగా తన కలం తో ప్రజలను చైతన్యం చేసిన మహనీయులు సురవరం ప్రతాపరెడ్డి అన్నారు. అలాంటి మహనీయుని పేరు చిరస్థాయి గా తెలంగాణ బిడ్డల గుండెల్లో నిలవాలంటే ప్రతేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీ కి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేసారు.

More articles

Latest article