27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ ది మాదిగల వ్యతిరేక పాలన

Must read

📰 Generate e-Paper Clip

  • వర్గీకరణ చట్టానికి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలి
  • ఆరవ రోజుకు చేరిన నిరసన దీక్ష.
  • ఎంఆర్పీఎస్  జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చెయ్యకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును నిరసిస్తూ జరుగుతున్న నిరసన దీక్షలు సోమవారం ఆరవ రోజుకు చేరుకున్నాయని ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ తెలిపారు. ఈ దీక్షకు జామతే ఇస్లాం, ఎంబిటీ ముస్లిం సంఘాలు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా  కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పీఠం ఎక్కిందే మాదిగలను మోసం చెయ్యడానికి అన్నట్లు ఉందన్నారు. ఎందుకంటే ఆగస్టు 1న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఒకవైపు స్వాగతిస్తునే ఇంకో వైపు డీఎస్సీ ఫలితాలు విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు. డా. షమిం అక్తర్ ని ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గా నియమించి, రిపోర్ట్ తీసుకొని అది శాస్త్రీయంగా లేదని మంద కృష్ణ మాదిగ నుంచి వినతి వస్తె మళ్ళీ ఒక నెల రోజులు గడువు పెంచి మళ్ళీ అదే రిపోర్ట్ ను యధాతధంగా పెట్టడం అంటే మాదిగలను మోసం చెయ్యడమే అవుతుందని తెలిపారు. ఆ తర్వాత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో మార్చ్ 12 నాడు వర్గీకరణ చట్టం తీసుకొస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత మాల సంఘాలు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ని, ఆర్పీఐ అధ్యక్షులు, ఎంపీ రాందాస్ హతవలెని కలిసి వర్గీకరణ చట్టాన్ని తెవొద్దు అని చెప్పడంతో అలాగే సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డా. షమిం అక్తర్ రిపోర్టును రద్దు చెయ్యాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందుకే మార్చ్ 12 నాడు రావాల్సిన బిల్లు మార్చ్ 17 కు జరిగిందన్నారు. మార్చ్ 18 నాడు బిల్లు పెడుతామని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ప్రతి సారి మాదిగ సమాజాన్ని మోసం చేస్తే మాదిగలు ప్రభుత్వానికి దూరం అవుతారని హెచ్చరించారు. ఇందులో కొంత మంది మాదిగ జాతి ద్రోహులు చేరి మాదిగ జాతిని అయోమయానికి గురి చేస్తున్నారన్నారు.ఈ దీక్షలో  ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున, సత్తెక్క, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు స్వప్న మాదిగ, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు శేఖర్ మాదిగ, విక్రమ్ మాదిగ, వినీత్ మాదిగ, జమాతే ఇస్లాం నాయకులు హుస్సేన్, మాజీ కార్పొరేటర్ ఎంఏ ముకీత్, ఎంబీటి జిల్లా సెక్రటరీ షేఖ్ అమ్జిద్, సామాజిక కార్యకర్త వసి అహ్మద్, జహీరుద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.

 

Congress is the anti-Madiga regime.

More articles

Latest article