24 C
Hyderabad
Sunday, August 2, 2026

దివ్యాంగులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు

Must read

📰 Generate e-Paper Clip

– పది పరీక్ష మార్కుల్లో  విద్యార్థులకు మినహాయింపు

–  బాధ్యతగా భావించి.. సేవ చేయాలి

– దివ్యాంగులకు సహాయ ఉపకరణాల అందజేత

– జిల్లా విద్యాధికారి పార్శి అశోక్ సూచనలు

నిజామాబాద్ : దివ్యాంగ విద్యార్థులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా విద్యాధికారి పార్శి అశోక్ అన్నారు. పది పరీక్ష మార్కుల్లో పాస్ మార్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపును ఇస్తోందన్నారు. దివ్యాంగుల సేవను తల్లిదండ్రులు, సహిత విద్యా విభాగం ఉద్యోగులు బరువుగా భావించకుండా బాధ్యతగా భావించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా విద్యా శాఖ, సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలింకో) సంయుక్తంగా దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లా కోర్డినేటర్ పడకంటి శ్రీనివాస్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ శిబిరంలో జిల్లా విద్యాధికారి పార్శి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దివ్యాంగుల అవసరాన్ని గుర్తించి సహాయ ఉపకరణాలు అందజేస్తున్న ఆలింకో సంస్థకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. దివ్యాంగులను వారి తల్లిదండ్రులను శిబిరానికి రప్పించడంలో కృషి చేసిన ఐఈఆర్పీ లకు అభినందలు తెలియజేశారు. అంతకు ముందు కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గత ఏడాది ఆగష్టు లో శిబిరం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 600 మంది దివ్యాంగ విద్యార్థులను ఆలింకో నిపుణులు పరీక్షించి 275 మందికి వివిధ సహాయ ఉపకరణాలు అవసరమని నిర్ధారించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలింకో నిధులు రూ. 23 లక్షల28 వేల 379 విలువైన పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. మొదటి సారిగా కోటగిరి మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి ముత్యపు వార్ ఈశ్వర్ కి బ్యాటరీ సైకిల్, నిజామాబాద్ రూరల్ కి చెందిన షేక్ అవెజ్ కు సెల్ ఫోన్ సైతం మంజూరుకాగా, అలాగే 17 బ్రెయిలీ కిట్స్ , 44 హీరింగ్ ఎయిడ్స్ , 63 వీల్ చైర్స్, 87 ఎమ్మార్ కిట్స్, 8 ట్రై సైకిల్స్, 5 రోలేటర్స్ , 51 ఇతర పరికరాలు మంజూరు అయ్యాయన్నారు..  భవిత కేంద్రాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన దివ్యాంగ విద్యార్థులకు మంజూరైన ట్రావెలింగ్ అలవెన్స్, ఎస్కార్ట్ అలవెన్స్, బాలికలకు స్టైఫండ్, రీడర్ అలవెన్స్ త్వరలో విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయన్నారు. చంద్ర శేఖర్ కాలనీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎతేశాముల్లా తో పాటు ఆలింకో నిపుణులు సిబాసిస్ పట్నాయక్, రిషి , ఆరుల్ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని నింపుతూ పరికరాలపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. డీఏం అండ్ హెచ్ వో ఆధ్వర్యంలో వైదులు సేవలు అందించారు. అనంతరం దివ్యంగులతో పాటు వారి తల్లిదండ్రులకు ట్రావెలింగ్ అలెవెన్స్ ఇస్తూ భోజన సౌకర్యాన్ని కలిపించారు. ఈ శిబిరంలో ఐఈఆర్పీ లు ప్రకాష్, లింబాద్రి స్వామి, సంతోష్, శేఖర్, నగేష్ గౌడ్, జలంధర్, కిషన్ సాగర్, ఆనంద్ , కిషన్, లక్ష్మణ్, ప్రసాద్ , రాజ నర్సయ్య , విటలేశ్వర్ , రాజేష్, వర ప్రసాద్, ప్రేమ స్వరూప, శైలజ, మౌలిక, రమాదేవి, రాధిక,వసుంధర,భారతి, సౌమ్య, పద్మజ, లత, పద్మ, ముత్తమ్మ శుభారాణి, స్పెషల్ టీచర్లు శ్రీనివాస్ రెడ్డి, గంగామణి, మురళీ, సురేష్, సోనీ తదితరులు పాల్గొన్నారు.


Equal opportunities for the disabled in all fields

More articles

Latest article