23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

చికిత్స పొందుతూ మహిళా మృతి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని చెంగల్ కు చెందిన సంగెం శారద (47) నాప్తలిన్ గోళీలు మింగి, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మృతురాలి కూతురు సంగెం రోస్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.మృతురాలి భర్త గత 10 సంవత్సరాల క్రితం మరణించగా మృతురాలు శారద జీవించడానికి అప్పులు చేసింది. ఆ అప్పులు మృతురాలి సంపాదనతో తీర్చలేకపోగా, అప్పుల రంధితో భాధపడుతూ బుధవారం మధ్యాహ్నం నాప్తలిన్ (డాంబార్)గోళీలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో కూతురు రోస్లీఅనుమానం వచ్చి ఏమైంది అని అడగగా నాప్తలిన్ గోళీలు మింగానని చేప్పగా,వెంటనే చికిత్స నిమిత్తం ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటలకు తరలించింది. అక్కడ చికిత్స పొందుతు విపరీతమైన వాంతులు చేసుకోవడంతో శారధను నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 12.31 మృతి చెందినట్లు ఫిర్యాదులో పేరుకొన్నారు. కూతురి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

More articles

Latest article