27.3 C
Hyderabad
Friday, July 31, 2026

వినియోగదారుల పరిష్కార వేదిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని టౌన్ వన్ సబ్ డివిజన్ పరిధిలో డి వన్ సెక్షన్ పవర్ హౌస్ లో గురువరం వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల నుంచి చైర్మన్ ఈ.నారాయణ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్క ఫిర్యాదు అందింది. వర్ని చౌరస్తాలో లివింగ్ కె.వి లైన్ సంబంధించిన ఇనుప పోల్ ను తీసివేసి సిమెంట్ పోల్ వేయాలని రామకృష్ణ అనే వినియోగదారుడు దరఖాస్తు చేశారు.  చైర్మన్ స్పందిస్తూ ఇనుప పోల్ ను తీసివేసి సిమెంట్ పోల్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల పరిష్కార వేదిక మెంబర్ టెక్నికల్ ఎస్. రామకృష్ణ ,మెంబర్ ఫైనాన్స్ కిషన్, ఫోర్త్ మెంబర్ రాజారెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ తరఫున డి ఈ ఆపరేషన్ ఎం శ్రీనివాస్, ఏడీఈ టౌన్ 1 ఆర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మంగ్త్య నాయక్ ,ఏ ఈ డి వన్ నగేష్, డి6 ఏఈ ఎం ఏ రాహుఫ్, డి1, డి6 చెందిన వినియోగదారులు పాల్గొన్నారు.

More articles

Latest article