26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీసింగ్ లో బోధన్ పోలీసుల తీరే వేరయా?

Must read

📰 Generate e-Paper Clip

  •  వివాదాల్లో బోధన్ పోలీసులు
  • చర్యలు తీసుకోకపోవడంతో రెచ్చిపోతున్న అధికారులు

నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ లో బోధన్ సబ్ డివిజన్ పోలీసుల తీరే వేరయా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇటీవల కాలంలో తరుచుగా పోలీసు శాఖలో వివాదాలు తలెత్తితే నిజామాబాద్ జిల్లాలో అందరి వేళ్ళు బోధన్ వైపే చూపుతున్నాయి. అందుకు కారణం అక్కడ పని చేస్తున్న అధికారుల తీరే. ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట అందరికీ అందుబాటులో పోలీసుల సేవల అందిస్తామని చెబుతుండగా బోధన్ సబ్ డివిజన్ లో పని చేస్తున్న అధికారులు మాత్రం తరుచుగా వివాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అందుకు అక్కడున్న పరిస్థితులు ఒక కారణమైతే అధికారుల వ్యవహర శైలి కూడా మరొక కారణమని చెప్పాలి. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని అధికారుల తీరు పోలీసు శాఖకు మచ్చతెచ్చేలా ఉంది. తాజాగా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో చోరిలకు పాల్పడ్డారని పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుడికి కాళ్ళకు గొలుసులతో వేసి ఉంచి స్టేషన్ లో పని చేయిస్తున్న వీడియో వైరల్ గా మారింది. పోలీస్ స్టేషన్ లో అనుమానితులను, నేరస్తులను విచారించాల్సిందిపోయి వారిచేత పని చేయించడమేమిటని అందరూ చర్చించుకుంటున్నారు. గత నెలలో ఎడపల్లి మండలం జాన్కంపేట్ ఆలయం వద్ద భక్తురాలు ఒకరు తన పర్సు చోరికి గురైందని అక్కడ పికేటింగ్ లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెపై లాఠీలతో చితకబాదిన వ్యవహరం వివాదం సద్దుమనగలేదు. ఇప్పటికి పలుమార్లు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ తో పాటు ఇంచార్జి పోలీసు కమిషనర్ కు, డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండకు చెందిన గిరిజన వ్యక్తిని ఫోక్సో కేసులో అదుపులోకి తీసుకోగా అతను లాకప్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోకముందే తాండ వాసులు విపరీతంగా కొట్టడంతో ఆ దెబ్బలకే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం జరిగింది. ఈ విషయంలో తుఫ్రాన్ డీఎస్పీ ద్వారా విచారణ జరిగినా ఇప్పటి వరకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రెంజల్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి నిత్యం జరిగే ఇసుక అక్రమ రవాణా వ్యవహరంలో పోలీసులకు మామూళ్ళు, దందాలో ఇన్వాల్వ్ ఉందని ఆరోపణలు ఉన్న అధికారులపై చర్యలు తీసుకోకుండా సెలవులో పంపడం ఏమిటన్న చర్చ జరుగుతుంది. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తుల వద్ద అక్కడ పని చేసిన ఒక ఎస్సై నెలకు 8 లక్షల రూపాయల మామూళ్లు వసూల్ చేశారని ఇంటిలెజెన్స్ నివేదిక అందినా అతనిపై చర్య తీసుకోకుండా బదిలీ చేయడంపై విమర్శలున్నాయి. మంజిరా పరివాహక ప్రాంతంలోని మరొక పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో కనుసన్నుల్లోనే ఇసుక మహారాష్ట్రకు, హైదరాబాద్ కు తరులుతున్న ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు. దానితో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసింగ్ అంటే అధికారులు అత్యుత్సాహంగా పని చేస్తున్నారు. ప్రజలకు మాత్రం అక్కడ న్యాయం జరుగకపోగా అధికారుల అవినీతి, అక్రమాలు, జవాబుదారితనం లోపించడం అసహనం వ్యక్తం అవుతుంది. బోధన్ సబ్ డివిజన్ కేంద్రంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాతో పాటు పీడీఎస్ దందాలో లక్షల రూపాయల మామూళ్ళ వ్యవహరమే అక్కడ అధికారులపై చర్యలు తీసుకోరన్న వాదనలున్నాయి. తాజాగా నిజామాబాద్ కొత్త కొత్వాల్ గా ఐపీఎస్ సాయిచైతన్య నియమితులు కావడంతో పోలీసింగ్ వ్యవస్థలో మార్పులు ఉంటాయా లేక పాత ధోరణి కొనసాగుతుందా అన్న చర్చ ప్రారంభమైంది.

Are Bodhan policemen at their best in policing?

More articles

Latest article