రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామ శివారులో బోధన్ – రుద్రూర్ ప్రధాన రహదారి పై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు – ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులు బొప్పాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

