Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2025, 5:03 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామ శివారులో  బోధన్ – రుద్రూర్ ప్రధాన రహదారి పై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు – ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.  క్షతగాత్రులు బొప్పాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

Three people seriously injured in road accident