- ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
- పరారీలో మరొక చోరుడు
- బంగారు గొలుసులు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మాక్లూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో, నిర్మల్ జిల్లా బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ లకు, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను పట్టుకున్నట్టు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకటర్ రెడ్ది తెలిపారు. శనివారం ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు…గతేడాది డిసెంబర్ 12న నిజామాబాద్ నగరంలోని బోర్గాం( పి) కి చెందిన దుమాల లక్ష్మిబాయి ఒంటరిగా నడుచుకుంటు వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి గొలుసు తెంపుకెళ్లారని ఫిర్యాదు చేసినట్లు ఎసిపి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యప్తులో భాగంగా నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహరాష్ట్రలోని ధర్మాబాద్ కు చెందిన షేక్ ఇమ్రాన్ అలియాస్ అబ్బు, షేక్ అర్బాజ్ అలియాస్ మాయాలు ప్రస్తుతం బాసరలోని శారదా నగర్ లో నివాసం ఉండి చోరీలకు పాల్పడినట్లు సాంకేతిక సహాయంతో పట్టుకున్నారు. మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెంది అమన్ అలియాస్ అమన్ ఫటేల్ పరారీలో ఉన్నారని ఎసిపి తెలిపారు. దొరికిన ఇద్ధరు దొంగల వద్ద మూడు గొలుసులు ( 50 గ్రాముల ), ఒక బైక్ స్వాధీనం చేకున్నారు. అమన్ పటేల్ కోసం గాలిస్తున్నారు. ముగ్గురు కలిసి గొలుసు దొంగతనాలు, బైక్ లకు చోరీకి పాల్పడిన కేసులు ఎనిమిది కొలిక్కి వచ్చాయని ఎసిపి తెలిపారు. ఇద్ద రిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎసిపి పేర్కొన్నారు.


