25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ 13వ వార్షికోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ బసవతారక నగర్ లో గల శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ త్రయోదశ (13వ) వార్షికోత్సవమును మంగళవారం రోజున ఆలయ వ్యవస్థాపకులు పసిలోటి గోపి కిషన్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిట్ల కృష్ణ మహారాజ్, మల్లారం విచ్చేశారు. ఈ 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేక, అర్చన, మంత్రపుష్పాంజలిలు, గణపతి పూజ, మహా సుదర్శన యాగము, హవనము, పూర్ణాహుతి తదితర విశేష పూజలను గోపి కిషన్ దంపతులు అశోక్ దంపతులు తదితరులచే వేద పండితులు ప్రవీణ్ మహారాజ్ వారి బృందం నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా చక్రేశ్వర ఆలయ చైర్మన్ హరికాంత్ చారి, మారుతి మందిర్ చైర్మన్ శంకర్, వి డి సి కమిటీ చైర్మన్ గంగాధర్ పట్వారి,  ఏక చక్రేశ్వర సేవా సమితి చైర్మన్ అంకు మహేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, ఆలయ వ్యవస్థాపకులు మాట్లాడారు. బుధవారం సాయంత్రం స్వామివారి విగ్రహ రథోత్సవమును పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. అనంతరం భక్తుల కొరకు మహాన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది.

13th Anniversary of Sri Lakshmi Narasimha Swamy Temple

More articles

Latest article