శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ 13వ వార్షికోత్సవం
బతుకమ్మ బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ బసవతారక నగర్ లో గల శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ త్రయోదశ (13వ) వార్షికోత్సవమును మంగళవారం రోజున ఆలయ వ్యవస్థాపకులు పసిలోటి గోపి కిషన్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిట్ల కృష్ణ మహారాజ్, మల్లారం విచ్చేశారు. ఈ 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేక, అర్చన, మంత్రపుష్పాంజలిలు, గణపతి పూజ, మహా సుదర్శన యాగము,...