24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తడపాకల్ విద్యార్థికి అక్షర యాన్ బాలిక పురస్కారం-

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల:  అక్షర యాన్ ఉమెన్స్ రైటర్ మహిళ ఫోరం వారు మహిళా దినోత్సవం సందర్భంగా  ప్రతి సంవత్సరం సాహిత్య పరంగా పురస్కారాలను అందివ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే 2024-2025 సంవత్సరానికి గాను అక్షర యాన్ బాలిక పురస్కారాన్ని తడపాకల్ గ్రామానికి చెందిన ఇప్ప సౌమ్య  అనే విద్యార్థికి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నదని ప్రవీణ్ శర్మ తెలియజేశారు. సాహిత్యపరంగా సౌమ్య ఇప్పటికే అనేక కవితలు కథలు రాసి జాతీయస్థాయిలో బహుమతులు అందుకోవడమే కాకుండా బంగారు బాల్యం అనే కవితల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతూనే సాహిత్యంలో రాణిస్తున్నది. సాహిత్య పరంగా చక్కటి ప్రతిభ కనబరుస్తున్న సౌమ్యను అక్షరయాన్ సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి ఐనంపూడి శ్రీ లక్ష్మీగుర్తించి ఈ పురస్కారాన్ని అందివ్వడం జరిగింది. ఈ పురస్కారం కింద నగదు బహుమతి ప్రశంస పత్రాన్ని ఇవ్వడం జరిగింది. బాలికా పురస్కారం అందుకున్న సౌమ్యను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.

More articles

Latest article