తడపాకల్ విద్యార్థికి అక్షర యాన్ బాలిక పురస్కారం-
బతుకమ్మ, ఏర్గట్ల: అక్షర యాన్ ఉమెన్స్ రైటర్ మహిళ ఫోరం వారు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం సాహిత్య పరంగా పురస్కారాలను అందివ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే 2024-2025 సంవత్సరానికి గాను అక్షర యాన్ బాలిక పురస్కారాన్ని తడపాకల్ గ్రామానికి చెందిన ఇప్ప సౌమ్య అనే విద్యార్థికి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నదని ప్రవీణ్ శర్మ తెలియజేశారు. సాహిత్యపరంగా సౌమ్య ఇప్పటికే అనేక కవితలు కథలు రాసి జాతీయస్థాయిలో బహుమతులు అందుకోవడమే కాకుండా బంగారు బాల్యం అనే కవితల...