కొనసాగుతన్న మోదీ గుజరాత్ పర్యటన
వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రధాని మోదీ పర్యటన సొంత రాష్టం గుజరాత్‌లో కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం అక్కడి సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాసన్‌లోని రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించే అటవీ అతిథి గృహం సిన్హ్ సదన్‌లో రాత్రి బస చేశారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మోదీ జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో లయన్ సఫారీకి వెళ్లారు. కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీశారు.


