29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

 విద్యార్ధులకు చదవుతో పాటు పిట్నేస్ తరగతులు నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

 బిక్కనూర్ , బతుకమ్మ:

చదువుతో పాటు విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో బస చేసిన కలెక్టర్ శనివారం ఉదయం 6 గంటలకు యోగా చేస్తున్న విద్యార్థులతో పాటు కలెక్టర్ పాల్గొన్నారు.

Along with reading, fitness classes should be conducted for the students ప్రతీ రోజూ విద్యార్థులకు యోగా, వివిధ గేమ్స్ ఆడించాలని సూచించారు. అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పలువురు విద్యార్థులకు ఐఐటి ఆన్లైన్ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడారు. ఆన్లైన్ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని, ఐఐటి లో సీటు సాధించాలని అన్నారు. కలెక్టర్ తో పాటు ప్రిన్సిపాల్ రఘు ఉన్నారు.

Along with reading, fitness classes should be conducted for the students

పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్…..

బిక్కునూర్ లో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, ప్రతీ రోజూ గ్రామంలోని చెత్తను సేకరించాలని, అదేవిధంగా ఇంటింటి చెత్తను తడి పొడి విడివిడిగా సేకరించాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించాలని, ముఖ్యంగా జాతీయ రహదారి వెంబడి ఉన్న డాబా హోటల్ వద్ద చెత్తను తొలగించాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనం ను పరిశీలించి వేసవి దృష్ట్యా  చెట్లకు నీళ్ళు పొయాలని తెలిపారు. అనంతరం రోడ్డు ప్రకటన ఉన్న చెట్లకు కలెక్టర్ నీళ్ళు పోశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివ ప్రసాద్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Along with reading, fitness classes should be conducted for the students

More articles

Latest article