భిక్కనూరు, బతుకమ్మ : మహిమాన్విత క్షేత్రమైన సిద్ధ రామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయంలోని మూలభావి వద్ద స్నానాలు ఆచరించి సిద్ధ రామేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు . భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. భిక్కనూరు మండలంలోని గురుకుల పాఠశాల ఎన్ సి సి విద్యార్థులు, శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, మండలానికి చెందిన పలువురు వలంటీర్లుగా విధులు నిర్వహించగా భిక్కనూరు పోలీసులు ఆలయం వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. రాత్రి 12 గంటలకు ఆలయంలో లింగోద్భవ పూజ, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

